Header Banner

సరిహద్దుల్లో జ్వాలల వర్షం! పాక్ మీద విరుచుకుపడ్డ భారత దళాలు!

  Sat May 10, 2025 11:46        India

ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగశాఖ మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో వారు పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తున్నదని తెలిపారు. పాకిస్థాన్ దాడుల ద్వారా ఉద్రిక్తతలను పెంచుతున్నదనీ, భారత సైన్యం సమర్థంగా ప్రతిదాడులు చేస్తోందని వెల్లడించారు. శ్రీనగర్, ఉధంపూర్, బటిండా, భుజ్ వంటి ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, వాయుసేన ఆస్పత్రులపై కూడా దాడులు జరిగినట్టు తెలిపారు. శ్రీనగర్ నుంచి నలియా వరకు భారీ దాడులకు పాక్ పాల్పడుతోంది. భుజ్, బటిండాలోని ఎయిర్ స్టేషన్లపై దాడి చేయగా, భారత్ పాక్‌లోని ఎయిర్ లాంచర్లను ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను లక్ష్యంగా తీసుకొని దాడులు చేశారు. భారత దళాలు పాక్ దాడులకు ధీటుగా సమాధానమిస్తూ, సాధ్యమైనంతవరకూ సామాన్యులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నాయి. అయితే, పాక్ భారత కీలక వ్యవస్థలపై దాడులు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని విదేశాంగశాఖ పేర్కొంది. భారత్ సైనిక బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. పాకిస్థాన్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ లతో 26 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు పేర్కొనబడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత పాక్ దాడులు మరింత తీవ్రతరంగా మారాయని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #IndiaStrikesBack #BorderTensions #IndianArmy #PakistanAttacks #OperationSindoor #BreakingNews